సి హెచ్ మల్లా రెడ్డి
సాధారణ రైతు కుటుంబం నుండి మొదలైన తన ప్రస్థానం, అంచెలంచెలుగా పురోగమిస్తూ, అన్ని వర్గాల వారికి తొలి దశలో ప్రాథమిక విద్య ను మలి దశ లో ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చిన విద్యావేత్త శ్రీ చామకూర మల్లా రెడ్డి. తను నెలకొల్పిన విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందరికీ చేరువ లో కి తెచ్చి మాతృభూమి సేవ లో తరించే మేధావులను సుశిక్షితులను చేస్తున్న క్రమం లో, ప్రాంత, జాతి, లింగ, వయో భేదం లేకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడటానికి రాజకీయ రంగం లో కి అడుగుపెట్టారు. రికార్డులు సృష్టించడం ఆనవాయితీ గా అలవాటు గా మారిపోయిన మన మల్లా రెడ్డి ఆసియా లో నే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి స్థానం లో విజయ బావుటా ఎగురవేస్తూ తొలి అడుగు వేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక వ్యక్తి గా తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ శాసన సభ్యుడిగా ఆ పైతెలంగాణా రాష్ట్ర మంత్రి గా మరొక ముందడుగు వేశారు ప్రస్తుత మన కార్మిక సంక్షేమ శాఖామాత్యులు.
Events
Social Events
-
కేంద్రం వైఖరికి నిరసనగా షామిర్పెట్ లో రైతుల ధర్నా
మేడ్చల్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో షామిర్పెట్ మండలంలోని అలియబాద్ చౌరస్తాలో రైతుల ధర్నా చేయడం జరిగింది. మంత్రి శ్రీ మల్లారెడ్డి గారితో కలిసి పాల్గొన్న మహేందర్ రెడ్డి గారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన ధర్నాలో మంత్రి శ్రీ మల్లారెడ్డి గారితో కలిసి పాల్గొన్న తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు. భారీ ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించారు. మండలం కు చెందిన రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెరాస నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ చామకూర మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని తెలిపారు. ఓ వైపు వరి ధాన్యం కొనమని కేంద్రం చెప్పుతుంటే, స్థానికి బీజేపీ నేతలు వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. లేనిపోనిమాటలు చెప్పి రైతులను ఆయోమయానికి గురి చేస్తున్నారని, రాజకీయాల కోసం అమాకులైన అన్నదాతలను మోసం చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నందరెడ్డి, మెయేర్లు,డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్ లు, కార్పొరేటర్లు,కౌన్సిలర్లు,జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు,కో అప్షన్ సభ్యులు, మున్సిపల్, మండల, గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
-
బోయినపల్లి శ్రీ దుర్గామాత దేవాలయం (ఏడుగుళ్ళు) లో త్రితల రాజగోపురం (మహాద్వారం) ప్రారంభోత్సవ వేడుక లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.
బోయినపల్లి శ్రీ దుర్గామాత దేవాలయం (ఏడుగుళ్ళు) లో త్రితల రాజగోపురం (మహాద్వారం) ప్రారంభోత్సవ వేడుక లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.
-
బోయినపల్లి, మేడ్చల్, ఫిరాజాది గూడ లలో సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
బోయినపల్లి, మేడ్చల్, ఫిరాజాది గూడ లలో సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
-
ఘట్కేసర్ మండలం మందారం, ఎదులబాద్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి, అలాగే ప్రతాప సింగారం గ్రామంలో 1.5 కోట్లతో నూతనంగా నిర్మించబోతున మల్టి పర్పస్ ఫంక్షన్ హల్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి
ఘట్కేసర్ మండలం మందారం, ఎదులబాద్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి, అలాగే ప్రతాప సింగారం గ్రామంలో 1.5 కోట్లతో నూతనంగా నిర్మించబోతున మల్టి పర్పస్ ఫంక్షన్ హల్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి